ఎమర్జెన్సీ సేవలు సైతం బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ సేవలు సైతం బహిష్కరణ

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

శ్రీకాకుళం: జిల్లాలోని వైద్యారోగ్య కాంట్రాక్ట్‌ ఉద్యోగులు బుధవారం నుంచి ఎమర్జెన్సీ సేవలను సైతం బహిష్కరించారు. వీరు మంగళవారం నుంచి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనను ఉధృతం చేస్తూ రెండోరోజున ఎమర్జెన్సీ సేవలను సైతం బహిష్కరించారు. వీరంతా రిమ్స్‌ వైద్య కళాశాల ఆవరణలో ధర్నాను నిర్వహించారు. వీరి ఆందోళనకు పెన్షనర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ చౌదరి పురుషోత్తంనాయుడు, ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్‌, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘీభావం తెలిపిన వీరంతా మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్యారోగ్య కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జేఏసీ నాయకురాలు వేదవతి, జిల్లా నాయకుడు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళన బాటపట్టడంతో రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను భయపెట్టి విరమింపజేసేలా ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వేదవతి, వెంకటరమణలకు తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement