దొంగలు హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగలు హల్‌చల్‌

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

నరసన్నపేట: స్థానిక సాయి నగర్‌ కాలనీలో బుధవారం వేకువజామున దొంగలు హల్‌చల్‌ చేశారు. తాళం వేసి ఉన్న సడగాన సావిత్రి ఇంటి తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి బీరువా, ఇతర సామాగ్రిని చిందరవందర చేశారు. ఆ ఇంటి పక్కనే ఉంటున్న సాయికుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనం ఎత్తుకుపోయారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సావిత్రి తన కుమారుడు, కుమార్తె హైదరాబాద్‌లో ఉండడంతో వినాయక చవితి అనంతరం వెళ్లారు. కాగా ఈ చోరీలపై ఫిర్యాదు రాలేదని, ముందు జాగ్రత్త చర్యగా క్లూస్‌ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలు సేకరించినట్లు నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ తెలిపారు.

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలో కోవిలాం కాలనీలోని జావాపు సింహాచలం, వెంకట్రావుకు సంబంధించిన ఇంటి తాళాలను దొంగలు పగలగొట్టారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జావాపు సింహాచలం, వెంకట్రావులు జీవనోపాధి కోసం కొద్ది నెలలుగా విజయవాడలో ఉంటున్నారు. బంధువులు చనిపోయారని బుధవారం ఇంటికి వచ్చి చూడగా గేటు, తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయన్నారు. రెండు ఇళ్లను పరిశీలించగా వెంకటరావు ఇంట్లోని వెండి దీపం కుద్దులు రెండు దొంగతానానికి గురైనట్లు బాధితులు తెలిపారు. దీనిపై సరుబుజ్జిలి పోలీసులు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement