అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు సాధారణ రోజుల్లో అలంకరణకు వినియోగిస్తున్న వెండి ఆభరణాలతో పాటు మకరతోరణం ఇతరత్రా వస్తువులన్నింటికీ ఏకంగా సుమారు రూ.2.50 కోట్ల విలువైన బంగారంతో తాపడం చేయించారు. భాద్రపద ఏకాదశి పర్వది నం మంగళవారం ఉదయం గర్భాలయంలోని మూలవిరాట్టుకు ఉన్న అన్ని వెండి వస్తువులన్నీ బంగారమయ్యాయి. అలాగే శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులకు ఉన్న వెండి కిరీటాలు తదితర ఆభరణాలన్నీ బంగారు తాపడం చేయించడంతో అద్భుత వెలుగులతో భక్తులకు స్వర్ణాదిత్యుని దర్శనభాగ్యం కలిగింది. బెంగళూరుకు చెందిన ఓ దాత దంపతులు మంగళవారం ఆలయానికి విచ్చే సి స్వామి దర్శనం చేసుకుని తాము చేయించిన బంగారు తాపడ వస్తువులను, ఆభరణాలను ఆలయానికి సమర్పించారు. అంతకుముందు వారికి ఆల య సంప్రదాయం ప్రకారం ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయంలో దర్శనం చేయించారు. స్వామికి ఇంతకుముందే అన్ని పూర్తి బంగారు ఆభరణాలున్న సంగతి విదితమే. ఇప్పుడు వెండిపై బంగారు తాపడం చేయించిన ఆభరణాలతో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ అధికారులు తగిన భద్రతల నడుమ దర్శనాన్ని కలిగించారు. – అరసవల్లి


