జిల్లా సీనియర్స్‌ సెపక్‌తక్రా జట్ల ఎంపిక రేపు | - | Sakshi
Sakshi News home page

జిల్లా సీనియర్స్‌ సెపక్‌తక్రా జట్ల ఎంపిక రేపు

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్‌ పురుషులు, మహిళల సెపక్‌తక్రా జట్ల ఎంపికలు ఈ నెల 8న జరగనున్నాయని జిల్లా సెపక్‌తక్రా అసోసియేషన్‌ చైర్మన్‌ ఎమ్మెస్సార్‌ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ క్రీడా మైదానం వేదికగా గురువారం ఉదయం 9 గంటలకు మొదలవుతాయని చెప్పారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను ఈ నెల 10, 11 తేదీల్లో కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా జరగనున్న 36వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్‌ పురుషులు, మహిళల సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌–2026 పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెపక్‌తక్ర అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి, కోచ్‌ జి.అర్జున్‌రావురెడ్డి (9949291288)ని సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement