శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ముందస్తు నివారణ చర్యలకు ప్రాధాన్యమివ్వాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు సంబంధించి సీఐలు, ఎస్సైలతో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలు, వ్యక్తులను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. తరచూ గంజాయి అక్రమ రవాణా, క్రయవిక్రయాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ డి.లక్ష్మణరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు అవతారం, విజయ్కుమార్, శ్రీనివాసరావు, చిన్నంనాయుడు, మంగరాజు, తిరుపతిరావు, ప్రసాదరావు, వెంకటరావు, ఎస్సైలు పాల్గొన్నారు.


