యువకుడు అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

కంచిలి: కంచిలి మండలం శాసనాం–సోంపేట మండలం శారదాపురం గ్రామాల మధ్యలో రామకృష్ణాపురం గ్రామానికి చెందిన సవర వెంకటరావు(25) యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ విషయం మంగళవారం రాత్రి బయటపడింది. యువకుడు ద్విచక్ర వాహనం కంచిలి మండలం నువాగడ ప్రాంతంలో పార్కింగ్‌ చేసి ఉండటంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ముగ్గురు స్నేహితులతో కలిసి వేటకు వెళ్లి అక్కడ వన్యమృగాలకోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లను తాకడంతో షాక్‌కు గురై మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. అయితే, మృతదేహం ఒకచోట, బైక్‌ మరోచోట ఉండటం మిస్టరీగా మారింది. కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement