జ్ఞానేష్‌కుమార్‌ను తక్షణమే తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేష్‌కుమార్‌ను తక్షణమే తొలగించాలి

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

శ్రీకాకుళం అర్బన్‌: ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ఓటు చోరీకి పాల్పడిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఇండియా కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ ఓటు చోరీకి పాల్పడిన విధానాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఆదేశాల మేరకు అక్టోబర్‌ నుంచి ఎనిమిది వరకు జిల్లాలో ఇండియా కూటమి పార్టీల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్‌ 8న ఓటు బచావో.. దేశ్‌ బచావో నినాదంతో శ్రీకాకుళం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఇండియా కూటమి నాయకులు కిల్లి రామ్మోహనరావు, రెల్ల సురేష్‌, అంబటి కృష్ణ, తాండ్ర ప్రకాష్‌, ఎస్‌.కృష్ణవేణి, డి.గోవింద మల్లిబాబు, కోత మధుసూదనరావు, కొత్తకోట సింహాద్రి నాయుడు, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, విద్యారతు రమణ, డాక్టర్‌ కవిటి గోపాలకృష్ణ, కొత్తకోట లక్ష్మి, కూరాకుల వెంకటరావు, చాన్‌ బాషా, జి.రామారావు, గొల్లపల్లి బాలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement