టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్రావీధి సమీపంలో ఎత్తిపోతల పథకం నిర్మాణంపై మంత్రి అచ్చెన్నాయుడు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం నాయకులు నిలదీశారు. మంగళవారం టెక్కలి ఆదిఆంధ్రావీధిలో జిల్లా నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో ఎత్తిపోతల పథకానికి మంత్రి అచ్చెన్నాయుడు శిలాఫలకం వేశారని, తర్వాత పట్టించుకోవడం మానేశారన్నారు. నిర్మాణం పూర్తయితే ఆదిఆంధ్రావీధి, చింతామణి, నువ్వుగుడ్డి, ఆంజనేయపురం, గోపాలపురం, చిన్నకేదారి, వెంకటాపురం తదితర గ్రామాల్లో సుమారు 1500 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. దీనితో పాటు మరికొన్ని సమస్యలపై ఈ నెల 9న ఆదిఆంధ్రావీధి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు డి.గోవిందరావు, ఎన్.షణ్ముఖరావు, వి.సింహాచలం, టి.వైకుంఠరావు, కె.ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు, యు.లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పి.ధర్మారావు, వై.వెంకట్రావు, పి.రామారావు, డి.వైకుంఠరావు, ఎస్.దాలయ్య, జె.శంకర్రావు, చంద్రరావు, దానయ్య, మల్లయ్య, డి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


