విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లతో మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లతో మెరుగైన వైద్యం

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

అరసవల్లి: విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశాలున్నాయని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం విలేజి హెల్త్‌ క్లినిక్‌ల రాష్ట్ర వ్యాప్త వర్చువల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 24 జిల్లాల్లో 267 విలేజి హెల్త్‌ క్లినిక్‌లను రాష్ట్ర వైద్య శాఖామంత్రి సత్యకుమార్‌ వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జి.సిగడాం మండలం శేతు భీమవరం, సారవకోట మండలం కిన్నెరవాడ, గార మండలం చల్లపేట, శ్రీకూర్మం–2, ఎస్‌.మత్స్యలేశం, నరసన్నపేట పట్టణం–3లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పాటు ఎన్‌హెచ్‌ఎం నిధులతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులచే నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement