అంతటా నీరుత్సాహం | - | Sakshi
Sakshi News home page

అంతటా నీరుత్సాహం

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

తీరని దాహం..

● మంచినీటికి నోచుకోని ప్రభుత్వ బడుల పిల్లలు

● పాఠశాలల్లో మూలకు చేరిన ఆర్‌ఓ ప్లాంట్లు

● ఇళ్ల నుంచే నీటి బాటిళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు

ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో 17 పాఠశాలలకు ఆర్‌ఓ ప్లాంట్లు సరఫరా చేయగా, వాటిలో 9 పాడైపోయాయి. వాటిని బాగు చేయాలని కోరితే ఇంతవరకు దిక్కూమొక్కూ లేదు.

ఇదీ పరిస్థితి..

● కవిటి మండలంలో విచిత్ర పరిస్థితి. ఇక్కడ ఆరు పాఠశాలలకు ప్లాంట్లు మంజూరైనా నేటికీ ఇన్‌ స్టాల్‌ చేయలేదు. ఆర్‌.బెలగాం, బట్టివానిపాలెం, సిలగాం, దూగానపుట్టుగ, మున్నిపుట్టుగ, పెద్ద మెళియాపుట్టుగలకు ప్లాంట్లు వచ్చాయి. కానీ వాటి వినియోగానికి మోక్షం లేదు.

● సోంపేటలో బారువ, బట్టిగల్లూరు, కొర్రాయిపేట, మామిడిపల్లి, పలాసపురం,సోంపేట రూరల్‌,బేసిరామచంద్రాపురం, గొనకపాడు, బెంకిలి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు, చేపలగొల్లగండి, పీకే వీధి (సోంపేట),రామకృష్ణాపురం ఎంపీయూపీ స్కూళ్లు, జింకిభద్ర, బారువ బాలికల జెడ్పీ పాఠశాలల్లో ప్లాంట్లు పనిచేయడం లేదు.

● పలాసలో కాశీబుగ్గ సాయి కాలనీ, టెక్కలిపట్నం జెడ్పీ హైస్కూళ్లు, రంగోయి, ఈదురాపల్లి ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

● కంచిలి మండల పరిధిలో పోలేరు ప్రాథమికోన్నత పాఠశాల, ముండ్ల, పురుషోత్తపురం,ఎస్‌.ఆర్‌.సి. పురం ప్రాధమిక పాఠశాలల్లోను, పద్మతుల ప్రాథమికోన్నత పాఠశాల, కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపిఎస్‌డబ్ల్యూఆర్‌ కంచిలి, కేజీబీవీ జాడుపూడి, మఠం సరియాపల్లి పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, జెన్నాగాయి ప్రాథమికోన్నత పాఠ శాల, బి.నారాయణపురం ప్రాథమిక పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు పనిచేయడం లేదు. కంచిలి ఉన్నత పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంటు పనిచేయకపోవడంతో, సంబంధిత సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయారు. దీంతో ఇక్క డ సుజలధార కనెక్షన్‌ ఇచ్చి నీటిని వినియోగిస్తున్నారు. ఇక మఠం సరియాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ప్లాంటు రిపేరుకు చేరింది.

● జిల్లాలో అతి పెద్ద మత్య్సకార గ్రామమైన నువ్వలరేవు ప్రాథమిక పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంట్‌ మూలకి చేరడంతో పాఠశాలలో చదువుతున్న 230 మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కాశీనగర్‌ ప్రాధమిక పాఠశాలలో ఆర్‌ఓ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసి వినియోగం మరిచారు. దీంతో పాఠశాలలో చదువుతున్న 269 మంది చిన్నారులకు వాటర్‌ బాటిల్‌ దిక్కుగా మారింది.

వజ్రపుకొత్తూరు మండలంలో గోవిందపురం, పొల్లాడ, పల్లిసారథి, యూకేపురం పెద్దబడాం, యూఆర్‌కేపురం, హుకుంపేటతో పాటు 30 పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్‌లు పని చేయడం లేదు. ఇదికాక బత్స లవానిపేట, హుకుంపేట, డోకులపాడు పాఠశాలల్లో దాతలు వాటర్‌ ప్యూరిఫైయర్స్‌ ఏర్పాటు చేనప్పటికీ నిర్వహణ కొరవడడంతో అవి మూలన పడ్డాయి. పొల్లాడ ప్రాథమికోన్నత పాఠశాలలోనూ ప్లాంటు మూలకు చేరగా.. బల్లి బాలకృష్ణ తన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నుంచి రోజుకు ఎనిమిది క్యాన్లు నీరు ఇస్తున్నారు.

తెచ్చుకున్న నీళ్లు సరిపోవడం లేదు

ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక సీసాతో నీళ్లు తీసుకువస్తున్నాం. అవి సాయంత్రం వరకు సరిపోవడం లేదు. ఎండాకాలంలా ఉంది. దాహం వేస్తుంది.

– మధు నీహారిక, బెంకిలి, ఐదో తరగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement