రైళ్లలో మొబైళ్లు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైళ్లలో మొబైళ్లు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

కాశీబుగ్గ: రైళ్లలో ప్రయాణికుల మొబైల్‌ ఫోన్ల ను చోరీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పలాస రైల్వే ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. వారి దగ్గరి నుంచి మొత్తం 10 ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో వీరిని పట్టుకున్నామని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఖలికోటకు చెందిన జగన్‌ బెహరా, బృందాబన్‌ జాలి అనే ఇద్దరు ఖలి కోట నుంచి వయా పలాస–శ్రీకాకుళం మార్గంలో ప్రయాణికుల రద్దీ ఆసరాగా తీసుకుని ఫోన్లను చోరీ చేస్తున్నట్లు నిర్ధారణ జరిగిందని ఎస్‌ఐ శ్రీనివాసరావు వివరించారు.

గాంధీ జయంతి రోజూ

మాంసం విక్రయాలు

నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలో శుక్రవారం యథావిధిగా మాంసం విక్రయాలు జరిగాయి. గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జరగకూడదని నిబంధనలు ఉన్నా.. స్థానిక మటన్‌ విక్రయదారులు, చికెన్‌ షాపుల యజమానులు యథేచ్ఛగా మాంసం అమ్మకాలు చేపట్టారు. ఈ రోజు మాంసం విక్రయాలు చేయకూడదు కదా.. అని ప్రశ్నించగా మాకు తెలీదు.. ఎవరూ చెప్పలేదు అని బదులిచ్చారు.

‘ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ప్రజలు గుర్తించాలి’

నరసన్నపేట: ‘మేజరు పంచాయతీ నరసన్నపేటలో అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. మెయిన్‌ రోడ్డు అభివృద్ధి, కాలేజీ రోడ్డు విస్తర ణ, మార్కెట్‌ వీధి అభివృద్ధి, తాగునీటి సౌక ర్యం అభివృద్ధి వంటి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా లేదు. వచ్చిన ఆదాయం అంతా ఉద్యోగుల జీతభత్యాలకే అయిపోతున్నాయి. ప్రజ లు గుర్తించాలి’ అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మేజరు పంచాయతీ నరసన్నపేటలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే సంక్షేమ పథకాలకు అధికంగా డబ్బు వెచ్చించాల్సి వస్తోందన్నారు.

పరిశుభ్రత, అహింసా మార్గాలే పురోగతికి బాటలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: మహాత్ముడు బోధించిన పరిశుభ్రత అంటే కేవలం చెత్తను ఎత్తివే యడం మాత్రమే కాదని, మనుషుల ఆలోచనలు, మనస్సులు కూడా శుభ్రంగా ఉంచుకోవడమే నిజమైన పరిశుభ్రత అని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలసి నిర్వహించిన మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన హరిత విప్లవం, సరిహద్దు దళాల పటిష్టత అజరామరమని కలెక్టర్‌ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement