సర్కారు డప్పు
రాజకీయాలకు ప్రజల సొమ్మా..?
మేము రూ.5వేలు గౌరవ వేతనం తీసుకుని ప్రభుత్వ పథకాలు, సేవలు అందించాం. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేశాం. కానీ మేమెప్పుడూ రాజకీయలు చేయలేదు. వలంటీర్‌లకు రూ.5వేలు జగన్ ప్రభుత్వం ఇస్తే ప్రజా ధనం వృధా చేస్తున్నారంటూ రచ్చరచ్చ చేశారు. ఇప్పుడేమో రాజకీయ ప్రచారానికి కూటమి ప్రభుత్వం రూ.లక్షలు ప్రజాధనం వెచ్చించడం సరికాదు.
– తెరుపల్లి రాజు, మాజీ వలంటీరు, దేవునల్తాడ, వజ్రపుకొత్తూరు మండలం
మేం ప్రజలకు ఉపయోగపడ్డాం
గత ప్రభుత్వంలో రూ.5వేల జీతంతో నిమిషాల్లోనే రేషన్ కార్డులిచ్చాం. ఆరోగ్య సమస్యల నుంచి ప్రభుత్వ సేవల వరకు తీర ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచాం. మత్స్యకారులకు సేవలు చేశాం. ఆ సేవలకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగమంటూ ఎల్లోమీడియా డప్పుకొట్టింది. ప్రజా సేవకు ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమైంది. – కారి కామేశ్వరి,
మాజీ వలంటీరు, వజ్రపుకొత్తూరు మండలం


