● వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే అనుచరులు
పోలాకి:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్వగ్రా మం పోలాకి మండలం మబగాంలోనే శుక్రవారం క్రియాశీల నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అందులో గ్రామానికి చెందిన మెండ కృష్ణమూర్తి(కిత్తయ్య), పల్లి భైరాగి, జుత్తు రామారావు, శిమ్మ రమేష్, కొప్పుల అప్పారావు, నక్క సూర్యనారాయణ, తెలుగు రామారావు, గొద్దు ప్రసాద్ తదితరులు ఉన్నారు. గత కొంతకాలంగా మబగాంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోపాటు అనేక విషయాల్లో తమకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ధర్మాన సోదరుల రాజకీయంతోనే మబగాంకు గుర్తింపు వచ్చిందని, మళ్లీ మబ గాంలో పూర్వవైభవం కోసం కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు అన్నారు. కృష్ణదాస్‌తోపాటు యువనాయకుడు ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
అన్ని చోట్లా ఇదే పరిస్థితి కొనసాగుతుంది
ఒక్క మబగాంలోనే కాకుండా మొత్తం అన్ని చోట్లా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఆ పరిణామాలను ఎదుర్కోబోతున్నాయి. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం కూడా చూసి ఉండదు. ఇప్పటికీ అధికార పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు.
– ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


