సంక్షేమాన్ని గాలికి వదిలేశారు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమాన్ని గాలికి వదిలేశారు

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

● కూటమి మోసాలను ప్రజలకు

వివరిద్దాం

● గుర్తింపు కార్డుల పంపిణీలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూ టిగా ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో హయాతినగర్‌, గుజరాతిపేట, పీఎన్‌కాలనీ, ఫాజుల్‌బాగ్‌పేట, సీపన్నాయుడుపేట 40 నుంచి 45వ డివిజన్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను ఓ కల్యాణమండపంలో శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ మోసాలను వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని తెలిపారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి డబ్బులన్నీ అమరావతిలో పెట్టి తన సొంత మనుషుల అభివృద్ధికి చంద్రబాబు పాటు పడుతున్నారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం రూ. 14,500 చెల్లించడం దారుణమన్నారు. తీరా చూస్తే అమరావతికి వెళ్లాలంటే పడవ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందు లు లేవని, కాలేజీకి వెళ్లే వారికి ఫీజులు కట్టడం లేదని, ఎరువులు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.

కార్పొరేషన్‌లో దోపిడీ

శ్రీకాకుళంలో స్థానిక ఎమ్మెల్యే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కలిపి దోపిడీ చేస్తున్నారని, చిన్న ఇళ్లు కట్టు కున్నా వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా ఇక్కడ ఎంతో మంది పాలించినా ఈ స్థాయిలో అవినీతి ఎన్నడూ జరగలేదని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు ఎలాగూ లేవు.. ధరలు సైతం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నా యని విమర్శించారు.

కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు సీపానా రామారావు, చీమల తారక్‌, దున్న గన్నిరాజు, యడ్ల వెంకట్‌, సీపాన మహేంద్ర, కిల్లంశెట్టి అరుణ్‌కుమార్‌గుప్తా, దూసి నాగేశ్వరరావు, గుంట జ్యోతి, రావులపల్లి సురేంద్ర, సాహుకారి శ్రీనివాసరావు, లతో పాటు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు ఎంవీ పద్మావతి, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయరావు, కోణార్క్‌ శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరావు, చల్ల శ్రీనివాసరావు, ఎం.ఏ భేగ్‌, సాధు వైకుంఠరావు, తంగుడు నాగేశ్వరరావు, కింజరాపు రమేష్‌, మూగి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement