● అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి
● 31న పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలిరండి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా అభివృద్ధి వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల హయాంలోనే సాధ్యమైందన్న విషయం జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసునని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ధర్మాన సోదరులు జిల్లాకు ఏం చేశారని ఓ వీడియోలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రశ్నించడం చూశానని, ఇది సిగ్గు చేటని, కళ్లు ఉండి కూడా కింజరాపు కుటుంబం చూడలేకపోతోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయం టౌన్‌హాల్ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో శుక్రవారం మాట్లాడారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ మహిళా నాయకు లు పి.సుగుణారెడ్డి, గుంట జ్యోతి ఆయనకు రాఖీ కట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల గురించి వారికి తెలియకపోవడం దారుణమన్నారు. కింజరాపు కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి బాగా డ బ్బు గడించారని, ఎదుటి వారిని విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని అచ్చెన్నకు హితవు పలికారు. తల్లకిందులుగా తపస్సు చేసినా ధర్మాన సోదరులకు వచ్చిన పేరు అచ్చెన్నకు రాదనే విష యం తెలుసుకోవాలన్నారు. ఇటీవల బొత్స సత్యనారాయణపై అచ్చెన్న వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు నిదర్శనమని పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
31న జిల్లా పార్టీ కార్యాలయం పునఃప్రారంభం
సోమవారం నాడు జిల్లా కేంద్రంలో టౌన్‌హాల్ వద్ద జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందుగా జీటీ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి మధ్యాహ్నం 3గంటలకు పూలమాలలు వేసి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయం వరకు వచ్చి ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ నాయకులు భారీగా హాజరు కావాలని కోరా రు. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనపై గౌరవం పెరిగిందన్న విషయం కూటమి రెండున్నరేళ్ల పాలనలో తేటతెల్లమైందన్నారు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో పార్లమెంట్‌తో సహ ఎనిమిదికి ఎనిమిది వైఎస్సార్‌సీపీ గెలిచి తీరుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామంలో పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలన్నారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, తూర్పుకాపు బీసీ విభా గం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, యువజన విబాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, ఎస్‌ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాసరావు, జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, గ్రీవెన్స్‌సెల్ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, తంగుడు నాగేశ్వరరావు, ఊన్న నాగరాజు, నల్లబారికి శ్రీనివాసరావు, కింజరాపు రమేష్, భైరి మురళి తదితరులు పాల్గొన్నారు.


