ఇసుక ర్యాంప్‌పై ఆకస్మిక దాడులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక ర్యాంప్‌పై ఆకస్మిక దాడులు

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని కరజాడ గ్రామ సరిహద్దు వంశధార నదీ తీరాన అక్రమంగా నడుస్తున్న ఓ ఇసుక ర్యాంప్‌పై శ్రీకాకుళం రెవెన్యూ, మైన్స్‌, రూరల్‌ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు లారీలు, రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. గడిచిన కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు తహసీల్దార్‌ గణపతిరావు, రూరల్‌ ఎస్‌ఐ సురేష్‌, మైన్స్‌ ఆర్‌ఐ మాణిక్యాలరావు కలిసి దాడులు నిర్వహించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతంలో ఇసుక తరలింపునకు సంబంధించి మైన్స్‌, రెవెన్యూ అనుమతులు ఇవ్వలేదన్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement