విద్యార్థులకు కవిత, కథల పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కవిత, కథల పోటీలు

Aug 19 2026 12:30 AM | Updated on Aug 19 2026 12:30 AM

శ్రీకాకుళం కల్చరల్‌: గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కళాశాలల విద్యార్థులకు కవిత, కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్‌ కేతవరపు శ్రీనివాసు, కోశాధికారి నెట్టిమి రమణారావు, కంచరాన భుజంగరావు, పూజారి దివాకర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగం, అవినీతి, విద్యా విధానంలో లోపాలు, జెన్‌ జీ ఆందోళనలు, పేపర్‌ లీకులు, విద్యార్థుల ఆత్మహత్యలు, పర్యావరణం వస్తువుగా 30 పంక్తులకు మించని కవిత రాయాలని కోరారు. అభ్యుదయకరమైన ఆలోచింపజేసే సంఘటనలు, పరిణామాలు వస్తువుగా రెండు పేజీలకు మించని కథ, జెన్‌ జీ ఆందోళనలు – నవ్య సమాజం వైపు అడుగులు, అనే అంశంపై రెండు పేజీలకు మించని వ్యాసం రాయాలని కోరారు. సెప్టెంబర్‌ 10లోగా 94900 98811 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా గానీ, కేతవరపు శ్రీనివాసు, 8–42/1, తిలక్‌ నగర్‌, వంశధార క్వార్టర్స్‌ వెనుక, ఇలిసిపురం, శ్రీకాకుళం 532001కు పోస్టు ద్వారా గాని పంపించాలని కోరారు. ప్రథమ బహుమతికి రూ.2వేలు, ద్వితీయ బహుమతికి రూ.వెయ్యి, తృతీయ బహుమతికి రూ.500 అందిస్తామని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement