అరెస్టులతో భయపెట్టలేరు | - | Sakshi
Sakshi News home page

అరెస్టులతో భయపెట్టలేరు

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను కేసులతో వేధిస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులతో భయపెట్టలేరు. కుట్ర, కక్ష రాజకీయాలు ఎన్నాళ్లూ కొనసాగవు. కూటమి నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారు. – ధర్మాన కృష్ణదాస్‌,

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

ప్రజలు గమనిస్తున్నారు

ఎంతో మందికి ప్రాణాలు పోసిన మంచి వ్యక్తి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా చిత్రీకరిస్తూ కక్ష కట్టి అరెస్ట్‌ చేయడం తగదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి అరెస్టులు చేస్తున్నారు. కూటమి తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. – నర్తు రామారావు, ఎమ్మెలీ్స

అప్రజాస్వామికం

రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పాటిస్తున్న పోలీసులు తీరు అప్రజాస్వామికం. ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు కచ్చితంగా సమాధానం ఉంటుంది.

– పేరాడ తిలక్‌, వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త

కక్షసాధింపు తగదు

యాక్సిడెంట్‌ కేసును హత్య కేసుగా చిత్రీకరించడం తగదు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే సీదిరి అప్పలరాజుతో పాటు కుమారుడు ఆరవ్‌ను చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్త సంప్రదాయానికి కూటమి నాయకులు తెరలేపారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే కుట్రలను ప్రజలే తిప్పి కొడతారు.

– గొర్లె కిరణ్‌కుమార్‌, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే

ఊహాజనితమైన ఆరోపణతోనే..

ఆరవ్‌కు వేసిన సెక్షన్‌నే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పోలీసులు వాడారు. కల్పబుల్‌ హోమ్సైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌ సెక్షన్‌ కింద అరెస్టు చేశారు. వాస్తవానికి అప్పలరాజు యాక్సిడెంట్‌ సమయంలో అక్కడ ఉన్నారని గానీ, చూశారని గానీ, ప్రమాదానికి కారణమని గానీ రాయలేదు. పోలీసులు రిమాండ్‌ రాసేటప్పుడు వారికి నచ్చిన సెక్షన్‌ వేస్తారు. దాంట్లో భాగంగానే నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ వేసి కోర్టుకు పంపించే యోచనలో ఉన్నారు. వారి దగ్గరుండే మెటీరియల్‌ ప్రకారం ఏడు సంవత్సరాల లోపు నేరారోపణ రుజువైన కేసుల్లో స్టేషన్లోనే బెయిల్‌ ఇవ్వాలి. ఈ కేసు రికార్డు చూస్తే ఎటువంటి నేరం చేసినట్టు లేకపోయినా ‘ప్రోత్సహించారు’ అనే ఊహాజనిత ఆరోపణతోనే మాజీ మంత్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

– బాలరాజు, సీదిరి తరఫు న్యాయవాది

పలాస – కాశీబుగ్గలో 144 సెక్షన్‌

బుధవారం అర్ధరాత్రి నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు పలాస – కాశీబుగ్గలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement