రోడ్డు ప్రమాదంలో తెగిపడిన కాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తెగిపడిన కాలు

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

రోడ్డు ప్రమాదంలో తెగిపడిన కాలు

రణస్థలం: లావేరు మండలంలోని రాయిలింగారిపేట సమీపంలో విద్యుత్‌ స్తంభానికి అతివేగంగా ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన ప్రమాదంలో గొర్లె రామినాయుడు అనే వ్యక్తి కాలు తెగిపడింది. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గెడ్డ గొర్లెపేట గ్రామానికి చెందిన గొర్లె రామినాయుడు బుడుమూరు గ్రామానికి కిరాణా సామాన్లు కోసం వెళ్లి తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో రొంపివలస జంక్షన్‌ వద్దకు రాగానే బైక్‌ అదుపు చేయలేక ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభానికి ఢీకొనడంతో కాలు తెగిపడింది. స్థానికులు 108లో రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉందని లావేరు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement