ఇంకెన్నాళ్లీ తప్పుడు ఆరోపణలు..?
● దేవుడిని స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం తగదు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: స్వార్థ రాజకీయాలకు దేవుడిని వాడుకుంటూ ప్రతిపక్షంపై తప్పుడు ఆరోపణలు చేసి వాటిని నిజం అని ఒప్పించడానికి ఇంకెన్నాళ్లు మాయ మాటలు చెబుతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సూటిగా ప్రశ్నించా రు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని వాదించడానికి సిగ్గు లేదా చంద్రబాబూ, పవన్ కల్యాణ్, లోకేష్ అని మండిపడ్డారు. ఆయన ఆదివారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, చేపల ఆయిల్ వాడారని తీవ్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనుకొని సిట్ వేశారని, సీబీఐతో విచారణ జరిపించారని, తిరుమల అధికారులపై తీవ్రమైన ఒత్తిడి చేశారని పేర్కొన్నా రు. సీబీఐ నివేదికలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిరూపితం కాలేదన్నారు. ఈ నివేదికలు బహిరంగం కావడంతో తమ తప్పుడు ఆరోపణలు నిజం చేసేందుకు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నా రని అన్నారు. ఎప్పటికీ అబద్ధం నిజం కాదన్నా రు. దీన్ని ఇప్పటికై నా అంగీకరించి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని లడ్డూ వ్యవహారంలో తప్పును అంగీకరించాలని హితవు పలికారు. ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించడానికి వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు దీనికి తప్పకుండా బదులు తీర్చుకుంటామని అన్నారు. సమావేశంలో కృష్ణదాస్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, నరసన్నపేట, జలుమూరు ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, పోలాకి, సారవకోట నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, వరుదు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


