మన ప్రశాంతి ‘బంగారం’
● ఏషియన్ మహిళల సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్‌తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి సత్తా చాటింది. ఆరో ఏషియన్ మహిళల అంతర్జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో ప్రశాంతి కీలక పాత్ర పోషించడం గమనార్హం. క్రీడాకారిణి రాణించడంపై కలెక్టర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, సెపక్‌తక్రా అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తితోపాటు, సంఘ ప్రతినిధులు, కోచ్ గాలి అర్జున్‌రెడ్డి, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, సీనియర్ క్రీడాకారులు తదితరులు సంతోషం వ్యక్తంచేశారు.
దళిత నాయకులపై
కేసులు సరికాదు
టెక్కలి: దళితులు, దళిత నాయకులపై తప్పుడు కేసులు సరికాదని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు బోకర మోహన్‌రావు అధ్యక్షతన ఆదివారం టెక్కలిలో జిల్లా మహాసభలను నిర్వహించారు. జిల్లాలో టెక్కలి, పాతపట్నం మండలాల్లో దళితులు, దళిత నాయకుల పై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ అధికారుల పక్షపాత వైఖరితో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో భూ ఆక్రమణలు, ఆధిపత్య కులాల కబ్జాలపై ప్ర స్తావించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం వివిధ రకాల దళిత సమస్యలపై తీర్మానం చేశారు.
శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు
జలుమూరు: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈఓ కె.ఏడు కొండలు ఆదివారం తెలిపారు. ముందుగా ఆలయం రెండు వైపులా మాఢవీధుల గుండా బారికేడ్లు కట్టి అనంతరం ఆల యం ముందు, వెనుక భాగంలోనూ అవసరం మేర ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం పైడితల్లి, అరసవల్లి దేవాలయాల నుంచి బారికేడ్లు తీసుకురానున్నారు. ఆలయంలో 12 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా ఏడు సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
శ్రీముఖలింగం శాశ్వత ధర్మకర్తకు ఆహ్వానం
జలుమూరు: ఈ నెల 15 నుంచి 18 వరకు శ్రీముఖలింగంలో జరగనున్న శివరాత్రి ఉత్స వాలకు ఆలయ శాశ్వత ధర్మకర్త పర్లాఖిముండి మహారాణి కల్యాణి గజపతివర్మకు ఆహ్వానం అందించామని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు. పర్లాఖిముండిలో ధర్మకర్త స్వగృహానికి అర్చకులు, కమిటీ సభ్యులతో వెళ్లి ఆహ్వానం అందించామన్నారు. శివరాత్రి రోజు రాత్రి జరిగే లింగోద్భవానికి ఏటా కల్యా ణి గజపతి వర్మ హాజరై స్వామికి బంగారు, వెండి పువ్వులతో ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేయడం సంప్రదాయం.
ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు
టెక్కలి: ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి మినీ జూనియర్ క్రీడా పోటీలకు సంబంధించి ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. అండర్–12 విభాగంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో భాగంగా 210 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. వీరిలో 12 మంది చొప్పున రెండు విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.రామకృష్ణ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను అందజేశారు.
మన ప్రశాంతి ‘బంగారం’
మన ప్రశాంతి ‘బంగారం’


