బతుకుల్లో చీకటి
నందిగాం/టెక్కలి రూరల్: ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్పత్రికి వెళ్తుంటే మృత్యువు దారి కాచి దాడి చేసింది. ఎక్కడో ఒడిశా నుంచి శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్దామని బయల్దేరిన వారిని చావు పలకరించింది. నందిగాం సమీపంలో శనివారం అర్ధరా త్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతులు ఒడిశా వాసులు. పోలీ సులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సున్నాపురానికి చెందిన వాసుపల్లి దాలయ్య, వాసుపల్లి ముత్యా లమ్మ భార్యాభర్తలు. సముద్రంలో చేపల వేట చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దాలయ్యకు పక్షవాతం రావడంతో భార్య, కుటుంబసభ్యులు శనివారం సాయంత్రం బరంపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకు ళం జెమ్స్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో భార్య ముత్యాలమ్మ, గ్రామానికి చెందిన దగ్గరి బంధువులు వాసుపల్లి మోహినమ్మ(50), డొంక రామారావు(39), బైపల్లి చంద్రమణి(40), వాసుపల్లి నీ లాద్రి(31), బుడ్డ భారతి(19)తో కలిసి స్కార్పి యో వాహనంలో బయల్దేరారు. పులకల వెంకటరావు డ్రైవింగ్ చేశారు.
రోడ్డు పక్కన మృత్యు శకటం..
బండి అర్ధరాత్రి దాటాక నందిగాంకు చేరుకుంది. నందిగాం ఫ్లై ఓవర్ వంతెనకు కొద్ది దూరంలో హైవేపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఐచర్ వ్యాన్ బ్రేక్ డౌన్ అయ్యి నిలిపి ఉంచారు. దీని చుట్టూ హైవే సిబ్బంది స్టాపర్లు కూడా ఏర్పాటు చేశారు. రోగి తో వస్తున్న స్కార్పియో వాహనం రాత్రి 2.45 గంటల సమయంలో ఆగి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్‌ను సైతం ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో అనారోగ్యానికి గురై ఉన్న వాసుపల్లి దాలయ్య, వాసుపల్లి మోహినమ్మ(50) అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. దాలయ్య భార్య ముత్యాలమ్మ, రామారావు, చంద్రమణి, నీలాద్రి డ్రైవర్ వెంకటరావుకు తీవ్ర గాయాలయ్యాయి. భారతి సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నందిగాం ఎస్‌ఐ షేక్ మహమ్మద్ ఆలీ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతులను 108 వాహనం, హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడ చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్ చేయగా బంధువులు బరంపురం ఆస్పత్రికి తరలించారు. భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్ద రు మృతి చెందడం, మరో ఐదుగురు గాయాల పాలవ్వడంతో సున్నాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మృతి చెందిన
వాసుపల్లి మోహినమ్మ
మృతి చెందిన
వాసుపల్లి దాలయ్య
నందిగాం వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో
ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
అర్ధరాత్రి దాటాక ప్రమాదం
మృతులు ఒడిశా వాసులు
బతుకుల్లో చీకటి
బతుకుల్లో చీకటి
బతుకుల్లో చీకటి


