● అరసవల్లికి భక్తుల వరుస..
ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యాలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం రెండో ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పలువురు భక్తులు ఆరోగ్యం కోసం భక్తులు సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. మరోవైపు, ఎండ కారణంగా క్యూలైన్లలో పలువురు భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయంలో ప్రత్యేక పూజలు సందర్భంగా ఆదివారం ఒక్క రోజే రూ.21,32,969 ఆదాయం వచ్చినట్లు ఈఓ కె.ఎన్.డీ.వీ.ప్రసాద్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.11,33,100, పూజలు, విరాళాలు రూపంలో రూ.2,51,239, ప్రసాదాల రూపంలో రూ.3,20,885, వివిధ రకాల ఆన్‌లైన్ సేవల ద్వారా రూ.4,27,745 ఆదాయం వచ్చినట్లు వివరించారు. – అరసవల్లి


