ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ రిక్షా కార్మికుడు మృతిచెందాడు. బెల్లుపడ కాలనీకి చెందిన ఆసి బైరెడ్డి(50) ఎర్రచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా అప్‌లైన్ ట్రాక్‌లో తిరుపతి–పూరి ఎక్సప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని జీఆర్‌పీ ఎస్సై ఎస్‌కే షరీఫ్ తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీఆర్‌పీ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు