మల్లేష్‌కు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

మల్లేష్‌కు కన్నీటి వీడ్కోలు

May 21 2024 6:00 AM | Updated on May 21 2024 6:00 AM

మల్లే

మల్లేష్‌కు కన్నీటి వీడ్కోలు

తిలక్‌కు గృహ నిర్బంధం

కోటబొమ్మాళి: వెంకటాపురం గ్రామంలో ఈ నెల 16న ఎండలవారాల పండగ సందర్భంగా గ్రామదేవత గుడి వద్ద జరిగిన ఘర్షణలో టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త తోట మల్లేష్‌కు సోమవారం కన్నీటి వీ డ్కోలు పలికారు. ఆయన మృతదేహాన్ని విశాఖపట్నం నుంచి అంబులెన్సు లో పోలీసుల పర్యవేక్షణలో స్వగ్రామానికి తీసుకువచ్చారు. అప్పటికే బంధువులు, పార్టీ అభిమానులు వెంకటాపురానికి భారీగా చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లేష్‌ మృతదేహం వద్ద ఆయన భార్య ఆదిలక్ష్మి, కుమారుడు మాధవరావు బోరున విలపించడంతో అక్కడ ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యా రు. గ్రామస్తులు బంధువులు, అభిమానులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు మృతదేహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లేష్‌ మృతదేహానికి అంత్యక్రియలు ని ర్వహించారు. అంతిమ యాత్రలో వైఎస్సార్‌ సీపీ నాయకులు రోణంకి మల్లయ్య, మెండ తాతయ్య, దుక్క రామకృష్ణ, చింతాడ అనిరుద్రుడు, బోనె ఎల్లయ్య, రెడ్డి లక్ష్మణ, నేతింటి అప్పలస్వామి, ఎస్‌వీ రమణమూర్తి, గూట్ల లక్ష్మణరావు, కోతి చిన్నారావు, తోటి ససింహాచలం, కాల్ల గణపతి, బెలమర మహేష్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుల గృహనిర్బంధం

తోట మల్లేష్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కార్యకర్తలతో సిద్ధమవుతున్న కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.హేమసుందరరాజును కమలనాభపురంలోనూ, జిల్లా రైతు సమాఖ్య సభ్యుడు కవిటి రామరాజులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

● మల్లేష్‌ అంతిమ యాత్రకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

నందిగాం: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్న వెంకటాపురానికి చెందిన తోట మల్లేష్‌ అంతిమ యాత్రకు వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ వెళ్లకుండా పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితూరులో గృహ నిర్బంధం చేశారు. నందిగాం ఎస్‌ఐ మహమ్మద్‌ అమీర్‌ ఆలీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది 20 మంది సోమవారం ఉదయం తిలక్‌ ఇంటి వద్దకు చేరుకొని ఆయన బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వివిధ మండలాల నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అక్కడకు చేరుకొని పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ అచ్చెన్నా యుడు అడ్డాలో పోలింగ్‌ ఏజెంట్‌గా వైఎస్సార్‌ సీపీ తరఫున తోట మాధవరావు వెళ్లి రిగ్గింగ్‌ జ రగకుండా నిలువరించడంతో, అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో తెలుగుదేశం మూకలు గ్రామదేవత పండగలో మాధవరావు తండ్రి మల్లేష్‌పై దాడి చేసి మృతికి కారణమయ్యారని. అలాంటి వారిని అరెస్టు చేయకుండా, పార్టీ కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నాయ కుడిని హౌస్‌ అరెస్టు చేయడం పోలీసులకు తగదని అన్నారు.

‘మల్లేష్‌ మృతిపై విచారణ కోరుతాం’

నందిగాం: మల్లేష్‌ మృతిపై జుడీషియల్‌ ఎంకై ్వ రీ కోరుతామని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ తెలిపారు. సోమవారం తనను తన ఇంటి వద్ద గృహనిర్బంధం చేసిన అనంతనం తిలక్‌ విలేకరులతో మాట్లాడారు. మల్లేష్‌ హత్య కేసులో పోలీసులు నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. మాధవరావు తల్లి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యా దులో అచ్చెన్నాయుడు, హరిప్రసాద్‌, రామ్మో హననాయుడు ప్రేరణతోనే దాడి జరిగిందని పేర్కొన్నారని, కానీ టెక్కలి డీఎస్పీ దీనిలో రాజకీయ కోణం లేదని ప్రెస్‌నోట్‌ విడుదల చేయ డం కేసును పక్కదోవ పట్టించడమేనని అన్నా రు. బాధితులు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా, హత్యకు ప్రేరేపించిన వారి ని కస్టడీలోకి తీసుకోకుండా, దహన సంస్కారాలను బంధువులు వెళ్లకుండా అడ్డుకోవడం, అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నాయకులను గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. దీనిపై జిల్లా రిటర్నింగ్‌ అధికారికి, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి జుడీషియల్‌ ఎంక్వైరీ కోరుతామని ఆయన తెలిపారు. పల్నా డు జిల్లాలో జరిగే అల్లర్లపై చేపట్టే సిట్‌ దర్యాప్తు చిన్న వెంకటాపురంలో ఘటనలో కూడా చేప ట్టాలని కోరుతామన్నారు. ఈ దాడికి ప్రేరేపించిన వారిని తక్షణం అరెస్టు చేయాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీ నడుపూరు శ్రీరా మమూర్తి, నాయకులు చిన్ని జోగారావు, కణితి నారాయణమూర్తి, కవిటి వీరన్న, సర్లాన భైరాగి ఉన్నారు.

మల్లేష్‌కు కన్నీటి వీడ్కోలు 1
1/1

మల్లేష్‌కు కన్నీటి వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement