
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ఎచ్చెర్ల క్యాంపస్:
జిల్లాలో ఏపీఈఏపీ సెట్ కొనసాగుతోంది. ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏపీఈఏపీ సెట్‌లో ఇప్పటి వరకు 8208 మందికి గాను 7726 మంది హాజరు కాగా, 487 మంది గైర్హాజరయ్యారు. సోమవారం 2072 మంది హాజరు కావాల్సి ఉండగా, 1975 మంది హాజరయ్యారు. 97 మంది గైర్హాజరయ్యారు. నరసన్న పేట కోర్ టెక్నాలజీస్‌లో మొదటి షిఫ్టులో 327 మందికి 311, రెండు షిఫ్టులో 327 మందికి 309 హాజ రయ్యారు. టెక్కలి ఐతంలో మొదటి షిఫ్టులో 300 కి 287, రెండో షిఫ్టులో 300 కి 293 మంది హాజ రయ్యారు. చిలకపాలేం శ్రీ శివానీలో మొదటి షిఫ్టులో 229 కి 214, రెండో షిఫ్టులో 230 కి 219 మంది హాజరయ్యారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజి నీరింగ్ కాలేజ్‌లో మొదటి షిఫ్టులో 179 కి 169, రెండో షిఫ్టులో 180 మందికిగాను 171 మంది హాజరయ్యారు.