
జగనన్న కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి వద్ద రిన్న మహంతి
మాకు సొంతిల్లు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉపాధి కోసం ఒడిశా వెళ్లాం. అక్కడ చిన్న పూరి గుడిసెలో బతికాం. వెళ్లిన చోటల్లా ఇళ్లకు అద్దెలు కడుతూ ఇబ్బందులు పడేవాళ్లం. ఇలాంటి సమయంలో మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు కూడా మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహ ప్రవేశం చేస్తాం. సొంతింటిలో నివాసం ఉంటామనే ఆలోచనే సంతోషంగా ఉంది. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.
– రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం