ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలి

Mar 15 2026 1:30 AM | Updated on Mar 15 2026 1:30 AM

శ్రీకాకుళం అర్బన్‌ : మినిమం/హయ్యర్‌ పెన్షన్‌పై ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో శనివారం సంఘ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.పి.రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ, ఉపాధ్యక్షుడు ఎస్‌.అప్పారావు మాట్లాడుతూ ఏపీ పీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్స్‌, గ్రాట్యుటీలపై రాష్ట్ర నాయకత్వం, సర్వీస్‌ సంఘాలకు లేఖలు పంపుదామన్నారు. మే 4న అసోసియేషన్‌ ఆవిర్భావ దినోత్సవం, జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుమన్‌, ట్రెజరర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement