సమాజ సేవలో సైతం..
శ్రీకాకుళం రూరల్: నిరుద్యోగ యువతకు, వైద్యరంగ అనుబంధ విభాగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ దిక్సూచిగా నిలుస్తోంది. శ్రీకాకుళం పరిధిలోని రాగోలులో గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ (జెమ్స్ కళాశాల) అనుబంధంగా 2016 జనవరి 1న ఆవిర్భవించిన ఈ సంస్థ కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కరరావు మార్గదర్శకత్వంలో మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరుద్యోగ నిర్మూలనకు విశేషంగా కృషి చేస్తోంది. ఈ పదేళ్లలో వేలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో విద్య, శిక్షణ, ఉపాధి అందిస్తున్న సంస్థగా ఖ్యాతిగాంచింది.
ఎన్నెన్నో కోర్సులు..
బొల్లినేని మెడిస్కిల్స్ అత్యుత్తమ పనితీరును గుర్తించిన అనేక కార్పొరేట్ సంస్థలు వీరితో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి. టెక్ మహీంద్రా ఫౌండేషన్, టాటా స్ట్రెవ్, జీఈ, హెచ్‌డ్‌ఎఫ్‌పీ, ఐఓసీఎల్, టాస్క్‌కిట్స్, హెచ్‌సీపీఎల్, ఎస్‌డీఐ, ప్రభుత్వ రంగంలోని ఐటీడీసీ, ఎన్‌ఎస్‌డీసీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీడాప్, ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ అథారిటీతో కలిసి కోర్సులు రూపొందిస్తున్నారు. జీడీఏ, బీఎఫ్‌ఎస్‌ఐ, ప్లబాటమిస్ట్, హాస్పిటల్ ఫ్రంట్‌డెస్క్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్‌కేర్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్, పేషెంట్ రిలేషన్ అసోసియేట్, హోటల్ మేనేజ్‌మెంట్, బ్యూటీషియన్, ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ వంటి నైపుణ్య అభివృద్ధి శిక్షణలతో నిరుద్యోగ యువతకు చేరువయ్యారు. పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణతో పాటు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 14,650 మంది నిరుద్యోగుల యువతకు శిక్షణ ఇచ్చి 70 శాతం మందికి పైగా ఉద్యోగాలను కల్పించారు.
వర్సిటీలకు అనుబంధంగా..
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ అనుబంధంగా ఇంటర్ బైపీసీ, డిగ్రీ బీఎస్సీ అనుబంధ హెల్త్ కోర్సులు, డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు మాస్టర్ ఆఫ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేటివ్, పీజీ డిప్లమా ఇన్ మెడికల్ రికార్ట్స్, క్రిటికల్‌కేర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ కోర్సులను కుడా బొల్లినేని మెడిస్కిల్స్ అందిస్తోంది. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ విద్యార్థులకు ఏపీ డిప్లమా ఎలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ కోర్సులను ఏపీఎస్‌హెచ్‌పీసీ అనుబంధంతో అందిస్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లు పొందిన వారికి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ సదుపాయం కల్పిస్తున్నారు.
బొల్లినేని మెడిస్కిల్స్‌లో బీఎస్సీ కార్డియాలజీ చేశాను. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన అత్యున్నత ఆస్పత్రిలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రపంచ వ్యాప్తంగా వైద్య అనుబంధ రంగాల్లో నిష్ణాతులైన నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేయగా భారత్ నుంచి ఎంపికై న ఇద్దరిలో నేనొకరిని. ఏడాదికి రూ.37లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. జీవితాంతం బొల్లినేని మెడిస్కిల్స్‌కు రుణపడి ఉంటాను.
– నిస్సీ లియోన్, తెనాలి, గుంటూరు జిల్లా
మా సంస్థలో చేరిన ప్రతి విద్యార్థికీ విద్యతో పాటు శిక్షణతో కూడిన ఉద్యోగం అందివ్వడమే మా లక్ష్యం. నిరుద్యోగాన్ని నిర్మూలన చేసేందుకు నిరంతర యజ్ఞంలా పనిచేస్తున్నాం. ఇంతవరకూ 15వేల మందికి శిక్షణ ఇచ్చి 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మాసంస్థ చైర్మన్ బొల్లినేని భాస్కరరావు అందించిన సహకారం మరువలేనిది. – సీహెచ్ నాగేశ్వరరావు,
బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
కరోనా వంటి కష్టకాలంలో టెక్ మహేంద్ర ఫౌండేషన్‌తో కలిసి శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఉపాధ్యాయులకు, గర్భిణులకు సరుకులు అందజేశారు. తెలంగాణాలోని గిరిజన తండాల్లో నివసిస్తున్న వారికి 18 రకాల నిత్యావసర సరుకులతో 3108 కిట్లును బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
యువతకు దిక్సూచీగా నిలుస్తున్న బొల్లినేని మెడిస్కిల్స్
రాగోలు జెమ్స్ ఆస్పత్రి అనుబంధంగా పదేళ్లుగా శిక్షణ కార్యక్రమాలు
నైపుణ్యం, వైద్య విద్యకోర్సులతో ఉపాధి కల్పిస్తున్న వైనం


