వరద గట్టు పూడ్చివేత | - | Sakshi
Sakshi News home page

వరద గట్టు పూడ్చివేత

Mar 15 2026 1:30 AM | Updated on Mar 15 2026 1:30 AM

వరద గట్టు పూడ్చివేత

ఇచ్ఛాపురం రూరల్‌: ఈదుపురం బాహుదానది వరద గట్టును అదే గ్రామానికి చెందిన మోతుబారి రైతు సాడి తులసయ్యరెడ్డి పొక్లెయినర్‌తో దౌర్జన్యంగా తవ్వినట్టు శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అంతా...నా ఇష్టం’ కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు ఆదేశాల మేరకు శనివారం వీఆర్వో తిరుమలరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం రైతుకు నోటీసు జారీ చేసి మళ్లీ వరద గట్టు పూడ్చిపెట్టారు. ప్రభుత్వ ఆస్తులను పరాయి వ్యక్తులు వాడుకోవడం గానీ, వాటిని విచ్ఛిన్నం చేసేందుకు గానీ ప్రయత్నిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement