వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డిపై అక్రమ కేసు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డిపై అక్రమ కేసు

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

హిందూపురం(చిలమత్తూరు): వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డిపై హిందూపురం పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈనెల 7వ తేదీన పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా గొడవ చేశారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ బీఎన్‌ఎస్‌ 132, 233 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్‌ల కింద వేణురెడ్డిపై వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ రోజు ఏం జరిగిందంటే...

ఈ నెల 7వ తేదీన మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుండగా... ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీ నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్‌ హాలులోకి వెళ్లడం, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, అభ్యర్థులను బయటకు పంపించేలా పోలీసులను ఉసిగొల్పారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి పార్టీ నాయకులతో కలిసి కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పీఏలను బయటకు పంపించి పారదర్శకంగా కౌంటింగ్‌ నిర్వహిస్తే తాము నిరసన విరమిస్తామన్నారు. ఎమ్మెల్యే పీఏలను కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపించకపోతే... లోనికి వెళ్లేందుకు తనకూ అవకాశం కల్పించాలంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయన్ను అడ్డుకొని దాడి చేసి బయటకు పంపించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురం డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ విధులకు ఆటంకం కలిగించారని, 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమల్లో ఉండగా గొడవ చేశారని పోలీసు అధికారుల ద్వారా అక్రమ కేసులు పెట్టించారు. అధికార దుర్వినియోగం చేసిన ఎమ్మెల్యే పీఏలు, ఇతర కౌంటింగ్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ప్రశ్నించిన వేణురెడ్డిపై కేసు నమోదు చేయడంపై హిందూపురం ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement