నేటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్సవాలు

Nov 12 2026 1:25 AM | Updated on Nov 12 2026 1:25 AM

ఉరవకొండ: దేశంలోనే ఎక్కడా లేని విధంగా పట్టణంలో దక్షిణాభిముఖంగా వెలసిన శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి షష్ఠి, కల్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయానికి సుమారు 400 ఏళ్ల చరిత్ర ఉంది. 12న స్వామి వారికి ఐదు రకాల ఫలాలు, 11 కేజీల తేనెతో అభిషేకాలు, 13న 108 పచ్చి టెంకాయలతో అష్టోత్తర పూజ, లక్ష్మీ నారాయణస్వామి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, 14న 108 లీటర్లతో క్షీరాభిషేకం, 15న అభిజిత్‌ లగ్నంలో కల్యాణం, 16న వసంతోత్సవం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.

కుమారుడి మరణం..

తల్లి హఠాన్మరణం

● మాతాశిశు మరణంతో తీరని విషాదం

గుమ్మఘట్ట: మాతాశిశు మరణం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రసవించిన కొద్దిసేపటికే శిశువు మరణించగా.. దీన్ని తట్టుకోలేకపోయిన తల్లి గంటల వ్యవధిలోనే ప్రాణం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుమ్మఘట్ట మండలం తాళ్లకెరకు చెందిన లక్ష్మక్క, బొమ్మయ్య దంపతుల కుమారుడు రాజన్నకు కర్ణాటక రాష్ట్రం గుడేకోట సమీపంలోని అల్లుకుందిచెరువు గ్రామానికి చెందిన మనోదిత(22)తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. మనోదితకు మొదటి కాన్పులో కుమారుడు జన్మించాడు. రెండోసారి గర్భం దాల్చిన ఆమె కాన్పు కోసం అల్లుకుందిచెరువు గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. మంగళవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున పండంటి మగబిడ్డను ప్రసవించింది. అయితే కొంతసేపటికే శిశువు చనిపోయాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మనోదిత తీవ్ర అస్వస్థతకు గురైంది. మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని విమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగానే ప్రాణం విడిచింది. ఈ ఘటనతో పుట్టినింట.. మెట్టినింట విషాదఛాయలు అలుముకున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement