టీడీపీ గూండాల దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాల దౌర్జన్యం

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందే టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగుతూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. పోలింగ్‌ సిబ్బంది గ్రామంలోని కేంద్రానికి చేరుకోగా, ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు ప్రతాప్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పురుషోత్తంరెడ్డి, లక్ష్మీరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు వారి వద్దకు వెళ్లారు. ఎన్నికల సిబ్బందితో ఏజెంట్‌ ఫారాలను నింపే విషయంపై చర్చిస్తుండగా.. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, పచ్చ గూండాలు దాదాపు 30 మంది అక్కడికి చేరుకుని వైఎస్సార్‌ సీపీ నేతలపై కుర్చీలతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల వారి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలనే అక్కడి నుంచి తోసుకుంటూ వెళ్లి బలవంతంగా వాహనం ఎక్కించారు. వాహనంలో వెళ్తున్న వారిపైనా టీడీపీ గూండాలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామం బయట వాహనాన్ని నిలిపి తనిఖీ చేస్తుండగా... వారిని తరుముతూ వచ్చిన పచ్చగూండాలు మరోసారి రాళ్లదాడి చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏజెంట్లపై దాడులకు ప్రణాళిక

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయాలని భావిస్తున్న టీడీపీ నేతలు...వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బత్తలపల్లి, ఓబుళాపురం, దంపెట్ల పోలింగ్‌ కేంద్రాల్లో దౌర్జన్యాలకు దిగి, అల్లర్లు సృష్టించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూర్చోకుండా దాడులకు దిగే అవకాశం ఉన్నట్లు టీడీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. కేవలం టీడీపీ వర్గీయులు మాత్రమే ఓటు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తద్వారా ఏకపక్షంగా ఓటింగ్‌ జరిగేలా పచ్చ గూండాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. బత్తలపల్లి మండలంలో జరుగుతున్న పరిణామాలపై ఎస్పీ సతీష్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపాలని మండల ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు.

నేడు వేతనంతో కూడిన సెలవు

ప్రశాంతి నిలయం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు వారి కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement