ఓడీచెరువు కేంద్రం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఓడీచెరువు కేంద్రం పరిశీలన

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

ఓడీచెరువు: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పరిశీలించారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, ఇతర ఎన్నికల మెటీరియల్‌ను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ వెంట రిటర్నింగ్‌ అధికారి రాజేంద్రకుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, ఎంపీడీఓ శివరాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement