పోలింగ్‌ సజావుగా సాగాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సజావుగా సాగాలి

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పుట్టపర్తి అర్బన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కొత్తచెరువు బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... స్ట్రాంగ్‌ రూంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, వైద్యసదుపాయం తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా నిరంతరం ఉండేలా చూసుకోవాలని, ఓటర్లు ఎండలో ఇబ్బందులు పడకుండా షామియానాలు ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement