పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకూ జిల్లాలోని 30 మండలాల్లో 582 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. గోరంట్ల మండలంలో అత్యధికంగా 56.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తనకల్లులో 51.6 మి.మీ, చిలమత్తూరు 48.2, అమడగూరు 41.2, ఎన్‌పీ కుంట 32.4, నల్లచెరువు 31.4, పుట్టపర్తి 30.4, రామగిరి 26.2, కదిరి 24.4, నల్లమాడ 22.8, ఓడీచెరువు 22.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే గాండ్లపెంటలో 21.2 మి.మీ, తలుపుల 18.4, పరిగి 17.6, బుక్కపట్నం 15.4, ధర్మవరం 15.2, హిందూపురం 14.6, బత్తలపల్లి 13.4, అగళి 11.6, మడకశిర 9.2, లేపాక్షి 9, ముదిగుబ్బ 8.6, రొద్దం 8.2, సీకేపల్లి 7.8, రొళ్ల 7, కొత్తచెరువు 6.2, పెనుకొండ 3.4, కనగానపల్లి 3.2, సోమందేపల్లి 2.6, తాడిమర్రి 2.2 మి .మీ వర్షపాతం నమోదైంది.
ప్రజా సమస్యల
పరిష్కార వేదిక రద్దు
ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, అందువల్ల రెవెన్యూ భవన్‌లో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
పుట్టపర్తి టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేంత వరకు పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ, పల్లెల్లో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
ప్రిన్సిపాల్‌పై విచారణకు ఆదేశం
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ప్రవీణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు స్పందించారు. ఆదివారం ఆయన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పాఠశాలలో జరిగిన ఘటన సోషల్ మీడియాతో పాటు పలు పత్రికల్లో కథనాలు రావడంతో కలెక్టర్.. చర్యల నిమిత్తం గురుకుల పాఠశాల కార్యదర్శికి నివేదికలు పంపినట్లు డీటీడబ్ల్యూఓ తెలిపారు. ఘటనను కలెక్టర్ ఓ.ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్ కుక్‌తో మసాజ్ చేయించుకున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.


