అనంతపురం ఎడ్యుకేషన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా, ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా దాడులు, దౌర్జన్యాలు జరిగాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రౌడీలు కలిసి ఆర్గనైజ్డ్‌గా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేరచరిత్ర ఉన్నవారిని ముందుపెట్టి, వారికి పోలీసులను కాపలాగా ఉంచి ధర్మవరం, పావగడ, అనంతపురం అర్బన్ తదితర ప్రాంతాల నుంచి వందలాది మందిని రప్పించి దాడులు చేయించారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ఏకపక్షంగా బైండోవర్లు చేశారని విమర్శించారు. మొదటి రెండు రోజులూ అనేక చోట్ల నామినేషన్లు వేయనీయలేదని, చెన్నేకొత్తపల్లిలో పది మంది అభ్యర్థుల నామినేషన్లను చింపివేసి దాడులు చేశారని తెలిపారు. బసంపల్లి స్థానానికి నామినేషన్ దాఖలు చేసి వచ్చిన వ్యక్తిపై దాడి చేశారని, పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి మరీ దాడి చేసి.. అక్నాలెడ్జ్‌మెంట్ పత్రాన్ని లాక్కున్నారని ఆరోపించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దుర్మార్గాలను జాతీయ మీడియా ప్రసారం చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు వచ్చాయని, దీంతో చివరి రోజు నామినేషన్ల దాఖలుకు అధికారులు అనుమతించారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అయినా ఒక్కో స్థానానికి ఒక్క అభ్యర్థితోనే నామినేషన్ వేయించాలని, డమ్మీ అభ్యర్థులతో వేయించకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించారని ఆరోపించారు. సుమారు 20కి పైగా నామినేషన్లను తిరస్కరించేలా చేశారని, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేయనీయలేదని మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, పరిటాల సునీత ఆదేశాలతోనే నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. తిరస్కరించిన నామినేషన్లను పునఃపరిశీలించి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాప్తాడులో ప్రజాస్వామ్యాన్ని
ఖూనీ చేశారు
టీడీపీ నేతలు, పోలీసులు, రౌడీలు
కలిసి దాడులకు తెగబడ్డారు
తిరస్కరించిన నామినేషన్లను
పునఃపరిశీలించాలి
దౌర్జన్యాలపై విచారణ జరిపి
చర్యలు తీసుకోవాలి
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్
పోలింగ్,
కౌంటింగ్‌లో
ఈ పరిస్థితి వద్దు..
వంద
హింసాత్మక
ఘటనలు..
శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం బిహార్‌ను ఎప్పుడో దాటిపోయిందని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. రాబోయే రోజుల్లో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లోనూ ఇదే తరహా దౌర్జన్యాలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు, పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నామినేషన్ల సమయంలో హింస, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయని, ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బండి పవన్‌కుమార్, సత్తిరెడ్డి, రామాంజనేయులు, బోనగిరి వరప్రసాద్‌రెడ్డి, లోకనాథరెడ్డి, ఈశ్వరయ్య, పాపంపేట ప్రసాద్‌రెడ్డి, భానుకోట శివ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ గూండాలు, రౌడీలు వంద హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం రూరల్ మండలం కొడిమికి చెందిన రాముడి తలపై బండరాయితో మోదడంతో తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఎంపీపీ అభ్యర్థి వరప్రసాద్‌రెడ్డిపై దాడి చేశారని, మహిళల చీరలు లాగుతూ దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆత్మకూరు మండలంలో టీడీపీ గూండాలకు టెంట్లు వేసి భోజన వసతి కల్పించారని విమర్శించారు. రాప్తాడులో రెండో రోజు తమ పార్టీ శ్రేణులు తిరగబడటంతో టీడీపీ గూండాలు పారిపోయారని చెప్పారు.
20కి పైగా నామినేషన్లు తిరస్కరించారు..
రౌడీలకు మండలాలు పంచి.. దాడులు


