కీర్తి ఘనం.. పాలన అధమం | - | Sakshi
Sakshi News home page

కీర్తి ఘనం.. పాలన అధమం

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

ధర్మవరం: సెలక్షన్‌గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన ధర్మవరంలో సమస్యలు తిష్టవేశాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోగా...అసౌకర్యాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

● పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణ నడిబొడ్డున ఉన్న నేసేపేట, పీఆర్‌టి సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది.

● శివారు ప్రాంతాల్లోని ఇందిరమ్మ కాలనీ, వైఎస్సార్‌, కేతిరెడ్డి కాలనీలకు సీసీరోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా డ్రైన్‌లలో పూడికతీత పది రోజులకు ఒకసారి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు.

● చెత్తసేకరణ ఆటోలు నిలిపి వేయడం వల్ల వార్డుల్లో ట్రాక్టర్‌ల ద్వారా చెత్త సేకరణ వారానికి ఒకసారి కూడా జరగడం లేదు.

● తాగునీటి సరఫరాలో ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఐదురోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. ఆ నీరు కూడా బురదమయం కావడం, లీకేజీలతో నీటి సరఫరా జరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● పట్టణంలోని కొత్తపేట, సుందరయ్యనగర్‌, ఎల్‌సీకేపురం, శాంతినగర్‌, సంజయ్‌నగర్‌, ఇందిరమ్మ కాలనీలలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.

● ట్రాఫిక్‌ సమస్య ప్రజలకు చుక్కలు చూపెడుతోంది. కాలేజ్‌ సర్కిల్‌ నుంచి గాంధీనగర్‌ వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణం నరకప్రాయమవుతోంది. పదేళ్ల క్రితం విస్తరణ చేసిన రోడ్లు ప్రస్తుతం పెరిగిన వాహనాలకు ఏమాత్రమూ సరిపోవడం లేదు.

● పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డుకు వెళ్లేందుకు రైల్వే అండర్‌ బ్రిడ్జి గానీ, ఓవర్‌బ్రిడ్జి గానీ లేకపోవడంతో రైలు గేటు వేసినప్పుడు కనీసం 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రధాన పాఠశాలలు, కళాశాలలు గేటుకు అవతల ఉండటంతో వేలాది మంది విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారి వద్ద ఆర్‌ఓబీ పనులు జరుగుతుండటంతో వాహనాలను మార్కెట్‌యార్డు నుంచి తిక్కస్వామి గుడి మీదుగా మళ్లించారు. అయితే ఆ రోడ్డు గుంతలమయం కావడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

● పట్టణంలో తరచూ జరుగుతున్న బైక్‌ దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌, ఏటీఎం చోరీ వంటి ఘటనలతో శాంతిభద్రతల ప్రశ్నార్థకంగా మారాయి.

● ధర్మవరంలో గతంలోలాగా రెండు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేయాలి. లీకేజీలు లేకుండా చూడటంతో పాటు ట్యాంకు క్లీనింగ్‌, క్లోరినేషన్‌ సకాలంలో సరిగా చేయాలి

● అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని ఏర్పాటు చేసి పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలి.

● వార్డుకొకటి చొప్పున48 చెత్త సేకరణ ఆటోను ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరణ చేయాలి.

● ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు ఔటర్‌ రింగ్‌రోడ్డును ఏర్పాటు చేయాలి.

● గత ప్రభుత్వంలో 90 శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదలకు పంపిణీ చేసి అద్దె భారం నుండి విముక్తి కల్పించాలి.

ధర్మవరం... పట్టుచీరలకు వాణిజ్య కేంద్రం. వేలాది సిల్క్‌షాపుల నిలయం. దేశ,

విదేశాల నుంచి వచ్చే వ్యాపారుల సందడి. వారానికి రూ.100 కోట్ల వ్యాపారం.

కానీ కూటమి పాలకుల నిర్లక్ష్యం... అధికారుల

పట్టింపులేని తనంతో అంతర్జాతీయంగా పేరుగాంచిన ధర్మవరం... రెండేళ్లలోనే

అసౌకర్యాలతో అపకీర్తి మూటగట్టుకుంటోంది. పారిశుధ్యం అధ్వానంగా మారడంతో ముక్కుమూసుకుంటే తప్ప వీధుల్లో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.

అంతర్జాతీయ కీర్తి..

అసౌర్యాలతో అపఖ్యాతి

పారిశుధ్యం అధ్వానం..

శివారు కాలనీల్లో సమస్యల తిష్ట

అభివృద్ధి కూడా అంతంత మాత్రమే

ప్రజలకు తప్పని ఇబ్బందులు..

పట్టించుకోని పాలకులు

ప్రధాన సమస్యలు

ప్రజల ఆకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement