పారిశుధ్యం అధ్వానం | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్యం అధ్వానం

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. వారం రోజులకు ఒకసారి కూడా డ్రైన్‌లు క్లీన్‌ చేయడం లేదు. చెత్త సేకరణ ఆటోలు లేక పోవడంతో ట్రాక్టర్లు ఇరుకు సందుల్లోకి రావడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలు చెబితే పట్టించుకునే వారే లేరు.

– కోళ్లమొరం శాంతి, గృహిణి,

శారదానగర్‌, ధర్మవరం

నీటి సమస్య వేధిస్తోంది

శివారు ప్రాంత కాలనీల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. వారం రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఎటు చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. వార్డులలో నూతనంగా సీసీరోడ్లు వేయడం లేదు. ప్రజల సమస్యలపై పాలకులు, అధికారులు సత్వరం స్పందించాలి.

– ఆకుల రామలింగ, ధర్మవరం

శాశ్వత పరిష్కారానికి చర్యలు

పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. ప్రధాన సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నాం. పారిశుధ్యం మెరుగునకు నూతన డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. చెత్త సేకరణను వేగవంతం చేశాం. డ్రైన్‌ల పూడికతీత, పారిశుధ్యం మెరుగునకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్‌ నివారణకు సిగ్నలింగ్‌ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. ఇంకా ఏవైనా సమస్యలుంటే ప్రజలు నేరుగా తెలుపవచ్చు. – వెంకటరమణయ్య,

మున్సిపల్‌ కమిషనర్‌, ధర్మవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement