పుట్టపర్తి టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. శనివారం మంచి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు ఉత్సాహం చూపారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల చైర్మన్ స్థానాలకు 19 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 218 వార్డులకు సంబంఽధించి రెండవ రోజు 413 నామినేశషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ సతీష్కుమార్ పర్యవేక్షణలో పోలీసుల గట్టి బందోబస్త్ చేర్పాటు చేశారు. నామినేషన్ల సమర్పణకు ఆదివారంతో గడువు ముగియనుండగా..మిగిన వారంతా నేడు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. కాగా జిల్లా వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు ఎవరన్న విషయం ఇంకా తేలలేదు. టికెట్లు దక్కనివారంతా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల
నామినేషన్ ప్రక్రియ
రెండో రోజు చైర్మన్ స్థానాలకు 19, వార్డు సభ్యులకు 413 నామినేషన్లు దాఖలు


