యథేచ్ఛగా మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి దందా

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

హిందూపురం (చిలమత్తూరు): నియోజకవర్గంలో అక్రమార్కులు సహజ వనరులను అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. ముఖ్యంగా మట్టిని ఎక్కడపడితే అక్కడ తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. హిందూపురం మండల పరిధిలోని కిరికెర చెరువు నుంచి వీవర్స్‌ కాలనీకి చెందిన ఓ టీడీపీ నేత తన ప్రైవేట్‌ వెంచర్‌కు మట్టి అక్రమంగా తరలిస్తున్నాడు. జేసీబీలతో తవ్వించి ట్రాక్టర్లతో మట్టిని తరలించుకుపోతున్నాడు. అలాగే చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు పంచాయతీలోని మదిరేపల్లిలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. వెంచర్ల అభివృద్ధి కోసం ఏకంగా ఏపీఐఐసీ భూముల్లో మట్టిని తవ్వేస్తున్నారు. అధికారులు సర్వే నంబర్‌ 330లో మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చామని చెబుతుండగా.. సర్వే నంబర్‌ 333లో మట్టిని తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మట్టి, ఇసుక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నించినా బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement