శభాష్‌ మైథిలి | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ మైథిలి

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

● జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో

గోల్డ్‌మెడల్‌

తాడిమర్రి: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో మండలంలోని దాడితోట విద్యార్థిని మైథిలి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. దాడితోట జడ్పీహెచ్‌ఎస్‌ వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీడీ) జయలక్ష్మీ వివరాలను వెల్లడించారు. వి.మైథిలి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చదువుతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తోంది. సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో సెప్టెంబర్‌ 26 నుంచి 30 వరకు జరిగిన 39వ సబ్‌ జూనియర్స్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌–కేరళ జట్లు తలపడగా ఆంధ్రప్రదేశ్‌ జట్టు విజయం సాధించి ట్రోఫీ కై వసం చేసుకుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వి.మైథిలి బంగారు పతకాన్ని సాధించింది. దీంతో పాఠశాల హెచ్‌ఎం ఉమా మహేష్‌ బాబు, పీడీ జయలక్ష్మీ, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు మైథిలికి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement