తెలుగు భాషకు శతాబ్దాల ఘనమైన చరిత్ర, సాహిత్య సంపద, సంస్కృతి ఉన్నాయి. తీయదనంతో పాటు భావాలను ఎంతో చక్కగా వ్యక్తీకరించే సామర్థ్యం తెలుగుకున్న ప్రత్యేకత. నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుంచి శ్రీశ్రీ , గురజాడ, విశ్వనాథ వంటి ఎందరో మహాకవులు, రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు భాషలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. ప్రస్తుత కాలంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– బుల్లే శంకర్ లైబ్రేరియన్, రాప్తాడు


