పావగడలో బాంబు పేలుడు | - | Sakshi
Sakshi News home page

పావగడలో బాంబు పేలుడు

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

పావగడ: తాలూకాలోని కనికలబండ గ్రామంలోని వ్యవసాయ భూమిలో నాటు బాంబు పేలిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... కనికలబండ గ్రామానికి చెందిన రైతు గిరియప్ప తన భూమిలోని మోటారు పంపును ఆన్‌ చేయడానికి స్టార్టర్‌ బటన్‌ నొక్కగానే బాంబు పేలింది. వెంటనే రైతు జాగ్రత్త పడగా వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న సీఐ సురేశ్‌, మధుగిరి డీఎస్పీ మంజునాథ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబు శకలాలను ప్రయోగ శాలకు పంపించారు. బాధిత రైతు గిరియప్ప మాట్లాడుతూ మూడు రోజులుగా తోటకు నీరు పెట్టలేదని, దీంతో ఈ రోజు ఉదయం నీరు పెట్టేందుకు మోటారును ఆన్‌ చేయగా భారీ శబ్ధంతో బాంబు పేలిందన్నాడు. ఇదే గ్రామానికి చెందిన మాజీ నక్సల్‌ ఉప్పర వెంకటేశ్‌ తనను బెదిరించాడని, దీనిపై తాను పావగడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానన్నారు. తనను మట్టు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించాడని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంకటేశ్‌పై కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement