ధర్మవరం రూరల్: హాకీలో మన అమ్మాయిలు అదరగొట్టారు. ఫైనల్స్‌లో కాకినాడ జిల్లా జట్టుపై 4–2 గోల్స్‌తేడాతో విజయం సాధించి అమరావతి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్న అమరావతి చాంపియన్ షిప్ హాకీ పోటీల్లో భాగంగా బాలికల హాకీ ఫైనల్ మ్యాచ్ గురువారం జరిగింది. కాకినాడ జిల్లా జట్టుతో తలపడిన శ్రీసత్యసాయి జట్టు అన్ని రంగాల్లో పైచేయి సాధించింది. 4–2 గోల్స్ తేడాతో విజయం సాధించి ట్రోఫీ కై వసం చేసుకుంది. అలాగే పురుషుల హాకీలోనూ శ్రీసత్యసాయి జిల్లా జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఫైనల్స్‌లో అనకాపల్లి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 3–0 గోల్స్ తేడాతో ఓటమి చెంది రన్నర్ ట్రోఫీని దక్కించుకుంది. విజేతలుగా నిలిచిన జట్లకు ఆగస్టు 29న స్పోర్ట్స్ డే సందర్భంగా బహుమతులను అందజేయనున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిషోర్, హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్య ప్రకాష్ తెలిపారు.
బెస్ట్ ప్లేయర్లూ మనవాళ్లే..
శ్రీసత్యసాయి జిల్లా జట్టు విజయాల్లో కీలకంగా మారిన క్రీడాకారులు నవ్య (అండర్–17 బాలికల విభాగం), పురుషుల విభాగంలో నవీన్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డులను దక్కించుకున్నారు. వీరికి క్రీడాకారులు, అధికారులు అభినందనలు తెలిపారు.
అమరావతి చాంపియన్ షిప్
కై వసం చేసుకున్న జిల్లా జట్టు


