దాహం తీరెనా ? | - | Sakshi
Sakshi News home page

దాహం తీరెనా ?

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

తీవ్ర వర్షభావంతో మనుషులతో పాటు పశుపక్ష్యాదులకూ తాగునీటి ఇక్కట్లు ఏర్పడ్డాయి. గతంలో గ్రామ శివారుల్లోని చెరువులు, కుంటల్లో నీరు ఉండటంతో పశువులు, ఇతర జీవులు అక్కడ నీరు తాగేవి. కానీ ప్రస్తుతం ఎక్కడా చుక్కనీరు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలోనే ఓ వానరం దప్పిక తీర్చుకునేందుకు గురువారం పరిగిలోని మండల కార్యాలయాలున్న ప్రాంగణానికి వచ్చింది. ఎదురుగా ఉన్న ఓ జలశుద్ధి కేంద్రంలో ప్రజల దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన కుళాయివద్దకు చేరి గొంతు తడుపుకునేందుకు ఇలా పడరానిపాట్లు పడింది. వానరం తిప్పలు గమనించిన జనం... మనుషుల సంగతి దేవుడెరుగు..కనీసం పశుపక్ష్యాదులకై నా జల సంరక్షణ కేంద్రాలు, నీటి తొట్టెలు, కుంటలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పాలకులపై ఉందని గుర్తు చేశారు. – పరిగి:

తాగునీటి కోసం వానరం పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement