హిందూపురం టౌన్: రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని శాంతిభద్రతలు, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం పట్టణంలో ఎస్పీ పర్యటించారు. అడిషనల్ ఎస్పీలు అంకిత సురాన, మహేష్‌లతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి గణేష్ మండపాలు, ఊరేగింపు మార్గాలు, ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీస్ కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
డిజిటల్ స్టిక్కర్లు పంపిణీ
కదిరిటౌన్: పట్టణంలోని కాలేజ్ గ్రాండ్‌లో గురువారం కదిరి పోలీస్, రవాణాశాఖ ఆధ్వర్యంలో 250 మంది ఆటో డ్రైవర్లకు డిజిటల్ ఐడి కార్డులు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ సతీష్ మాట్లాడుతూ ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేలా ప్రతి ఆటో డ్రైవర్ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఫొటో తదితర సమాచారన్ని భద్రత కలిగిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేసి ప్రత్యేక డిజిటల్ ఐడీతో కూడిన క్యూఆర్ కోడ్‌ను రూపొందించామన్నారు.
సఖ్యత కుదర్చడమే లక్ష్యం
కదిరి టౌన్: పట్టణంలోని పీవీఆర్ గ్రాండ్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సమస్యలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్ హజరై మాట్లాడారు. దంపతుల మధ్య సఖ్యత కుదర్చడమే లక్ష్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుందన్నారు.
గాండ్లపెంట: కుటుంబ హింసకు గురైన మహిళల సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్‌లలో కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి బాధితులకు సాయం అందిస్తున్నామని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కటారుపల్లి క్రాస్‌లో రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు జీవనోపాదులు కల్పించడానికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను ఆయన పరిశీలించారు.
ఎస్పీ సతీష్ కుమార్


