మడకశిర: పట్టణంలో శుక్రవారం కర్ణాటక పోలీసులు హల్‌చల్ చేశారు. దొంగలు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను రికవరీ చేయడానికి కర్ణాటక పోలీసులు ఇక్కడికి వచ్చారు. పట్టణంలోని ఓ బంగారు కుదవ అంగడి వద్దకు వెళ్లి దొంగలు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. వివరాలు... మడకశిర మండలానికి చెందిన అన్నదమ్ములు నాగరాజు, రాజు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు గొలుసులను దొంగిలించేవారు. కర్ణాటక ప్రాంతంలోని మధుగిరి, మిడిగేశి, హొసకెర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వారిని మిడిగేశి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో దొంగిలించిన బంగారు ఆభరణాలను మడకశిరలోని ఓ అంగడిలో కుదవ పెట్టినట్లు దొంగలు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు దొంగలను బందోబస్తుతో మడకశిరకు తీసుకువచ్చారు. కుదవ పెట్టిన షాపును దొంగలు చూపించారు. సదరు వ్యాపారి నుంచి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.
దొంగలు కుదవపెట్టిన
బంగారు ఆభరణాల రికవరీ


