‘చెస్’లో ఉత్తమ రేటింగ్
హిందూపురం టౌన్: తమిళనాడులోని కోయంబత్తురులో గత నెల 13, 14, 15వ తేదీల్లో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ క్లాసికల్ ఫిడే (వరల్డ్ చెస్ ఫెడరేషన్) రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో హిందూపురానికి చెందిన నలుగురు చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించారు. ఎన్‌పీ చార్విక్ 1506, మిథున్ పెద్దన్న 1495, మహాన్ పెద్దన్న 1447, జి.జ్ఞాపికరెడ్డి 1407 అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు చెస్ కోచ్ ఆరీఫుల్లా పేర్కొన్నారు. వారు చదువుతో పాటు చదరంగంలోనూ బాగా గొప్పగా రాణిస్తున్నారని అభినందించారు.
వివాహిత ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్: అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక చర్చి సమీపంలో లావణ్య (37) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అమడగూరు మండల కేంద్రానికి చెందిన సుబ్రమణ్యం భార్య లావణ్య ఆదివారం మధ్యాహ్నం కుమార్తె స్నానానికి వెళ్లగానే తలుపులు మూసివేసుకొని ఉరేసుకుంది. ఎన్నిసార్లు పిలిచినా తలుపులు తీయకపోవడంతో చుట్టు పక్కన ఉన్న వారు వచ్చి తలుపులు పగలకొట్టారు. లావణ్య ఇంటి పై కప్పుకు ఉరి వేసుకొని కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. లావణ్య భర్త పని నిమిత్తం రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ధర్మవరంలో మరొకరు...
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని తుంపర్తి కాలనీకి చెందిన ఆకుల కృష్ణమూర్తి (35) ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసుల వివరాల మేరకు... కృష్ణమూర్తి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య చిట్టెమ్మ, రెండేళ్ల కుమార్తె ఉంది. రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
‘చెస్’లో ఉత్తమ రేటింగ్
‘చెస్’లో ఉత్తమ రేటింగ్
‘చెస్’లో ఉత్తమ రేటింగ్


