భారీ పీఠం ఏర్పాటు
హిందూపురం: పట్టణంలోని సూగురు ఆంజనేయస్వామి ఆలయం వద్ద త్వరలో 45 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వాహకులు ఆదివారం 9 అడుగుల రాతి పీఠంపై 5 అడుగుల పధ్మాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విగ్రహ శిల్పి గుడియార్, కమిటీ చైర్మన్ వైసీ చంద్రశేఖర్, అభయాంజనేయస్వామి ట్రస్ట్ సభ్యులు రాయల్ గోపాల్, ఆదినారాయణ, కిషోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
హిందూపురం: మండలంలోని మనేసముద్రం పెట్రోల్ బంక్ వద్ద నారాయణప్ప (80)ను లారీ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు అప్‌గ్రేడ్ రూరల్ పోలీసులు తెలిపారు. ఆదివారం పెట్రోల్ బంక్ వద్ద లారీ రివర్స్ చేస్తున్నప్పుడు కర్ర పట్టుకుని నిదానంగా వెళ్తున్న వృద్ధుడిని తలగడంతో అక్కడే పడిపోయాడు. లారీ చక్రాలు ఎక్కడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో చైన్ స్నాచింగ్
ధర్మవరం: గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రైలులో బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ వెంకటేశు వివరాల మేరకు.. ధర్మవరానికి చెందిన శారద తన బంధువులతో కలసి యాదగిరి వెళ్తున్నారు. కల్లూరు సమీపంలోకి రాగానే బీదర్ వెళ్లే రైలు స్లో అయింది. దీంతో దొంగ మహిళ మెడలో ఉన్న మూడు తులాల మంగళ సూత్రం లాక్కెళ్లిపోయాడు. అప్రమత్తమైన మహిళ రైలు చైన్ లాగి, రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సుధాకర్, ఎస్‌ఐ వెంకటేషులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని రైల్లో జరిగిన చోరీపై ఆరా తీశారు.
వృద్ధురాలి గొలుసు అపహరణ
హిందూపురం: హిందూపురం మండలం చౌళూరు గ్రామంలో ఆదివారం సంజీవమ్మ అనే వృద్ధురాలి మెడలోని ఐదు తులాల రెండు బంగారు గొలుసులను దొంగ ఎత్తుకెళ్లాడు. స్థానికుల వివరాల మేరకు.. సంజీవమ్మ కుమారుడు, కోడలు బంధువుల పెళ్లికి వెళ్లారు. ఇంట్లో వృద్ధురాలు ఒక్కతే ఉంది. ఉదయాన్నే బయట నుంచి పాలు తీసుకుని ఇంటి లోపలికి వెళ్లింది. అదే సమయంలో దొంగ వృద్ధురాలిపై టవల్ కప్పేసి వెంటనే రెండు బంగారు చైన్లు లాక్కుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హిందూపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలిసిన వ్యక్తే గత రాత్రి నుంచే మాటువేసి అదును చూచి తెల్లవారు జామున ఇంట్లోకెళ్లి వృద్ధురాలి గొలుసులు అపహరించి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పలువురికి కుక్కకాటు
గుత్తి రూరల్: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు కుక్కకాటుకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆదివారం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రాజేశ్వరి, ఇసురాళ్లపల్లికి చెందిన సౌమ్య, ఇతర ప్రాంతాలకు చెందిన అప్పన్న, రంగయ్య, రామాంజనేయులు, విశాల, ఫాతిమా, చందనలను కుక్క కరవడంతో ఆస్పత్రికి వచ్చి యాంటి రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) తీసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు కూడా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు.
24న జాబ్ మేళా
అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 24న జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం సంస్థ పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందని, 10వ తరగతిపైన చదినవారు హాజరవ్వాలన్నారు.
భారీ పీఠం ఏర్పాటు
భారీ పీఠం ఏర్పాటు


